ఆ సినిమా టికెట్ కొన్న నాగార్జున

తెలుగులో రాబోతున్న కొత్త సినిమాల్లో 'తల' ఒకటి.

By Medi Samrat  Published on  13 Feb 2025 9:16 PM IST
ఆ సినిమా టికెట్ కొన్న నాగార్జున

తెలుగులో రాబోతున్న కొత్త సినిమాల్లో 'తల' ఒకటి. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో దీపా ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాస్ గౌడ్ నిర్మించిన ఈ చిత్రంలో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అంకితా నస్కర్ కథానాయిక. రోహిత్, ఎస్తేర్ నోరన్హా, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, వీజీ చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా, ధర్మ తేజ సంగీతం అందించారు. తల సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

బుక్ మై షోలో కింగ్ నాగార్జున ఈ సినిమాకి సంబంధించిన తొలి టికెట్‌ను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా ట్రైలర్‌ను వీక్షించి చిత్రబృందాన్ని అభినందించారు. రాగిన్ రాజ్ పెద్ద హీరో అవుతాడని నాగార్జున ఆశీర్వదించారు. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ ఎగ్జైటింగ్ గా ఉందన్నారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ నిర్మాత శ్రీనివాస్ గౌడ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అమ్మ రాజశేఖర్ సంతోషం వ్యక్తం చేస్తూ.. సినిమా తొలి టిక్కెట్టును నాగార్జున కొనుగోలు చేయడం ఈ సినిమా సాధించిన విజయానికి నిదర్శనమని అన్నారు.

Next Story