మహేష్ బాబు చెప్పిందే నిజమైంది..!

గుంటూరు కారం సినిమా విడుదలైన రోజు కొందరు కావాలనే నెగటివ్ టాక్ ను స్ప్రెడ్ చేసిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  19 Jan 2024 6:01 PM IST
మహేష్ బాబు చెప్పిందే నిజమైంది..!

గుంటూరు కారం సినిమా విడుదలైన రోజు కొందరు కావాలనే నెగటివ్ టాక్ ను స్ప్రెడ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం క్యూ కడుతూ ఉన్నారు. గుంటూరు కారం మీద జరగుతున్న చర్చల మీద నిర్మాత నాగవంశీ స్పందించాడు. గుంటూరు కారం బాక్సాఫీస్ కలెక్షన్ల మీద వచ్చిన ఆరోపణలపై నాగ వంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక ఎజెండాతో గుంటూరు కారం సినిమాను లక్ష్యంగా చేసుకుని ఒక వర్గం మీడియా, కొందరు వ్యక్తులు సినిమాను చంపే ప్రయత్నం చేశారన్నారు. సినిమాకి నచ్చకపోతే బ్యాడ్ రివ్యూ లేదా రేటింగ్ ఇవ్వడంలో తప్పు లేదు, కానీ సినిమాకు సంబంధించిన ప్రతికూల అంశాలను ప్రస్తావిస్తూ, సినిమాపై పాజిటివ్ గా ఏమీ రాయకుండా ఏకపక్షంగా మాత్రమే రివ్యూలు రాయడం సమస్యగా మారిందని అన్నారు. మా సినిమాను రివ్యూలు ఎఫెక్ట్ చేశాయంటే నేను ఒప్పుకోను. రివ్యూ అనేది పర్సనల్ ఒపీనియన్.. ఆ ఒపీనియన్‌ను మీరు మీ మీ వెబ్ సైట్స్‌లో రాస్తారు.. అది రైట్ అని ఏంటి గ్యారంటి? మీరమైనా సర్వేలు చేయించారా?అది మీ పర్సనల్ ఒపీనియన్.. అది తప్పని చెప్పే రైట్ నాక్కూడా ఉంటుంది.. మీరేమైనా దేవుళ్లా? అని ప్రశ్నించారు నాగ వంశీ. జనవరి 4న మా చేతికి సినిమా వచ్చింది.. సరిగ్గా ప్రమోట్ చేసుకునే టైం కూడా లేదు.. మా జానర్ ఇది.. మా సినిమా ఇలా ఉంటుంది.. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకునే టైం కూడా లేదన్నారు నాగ వంశీ.

మొదటి రోజు టాక్ చూసి తామంతా గందరగోళానికి గురైనా కూడా మహేష్ బాబు మాత్రం చాలా కాన్పిడెంట్‌గా ఉన్నారని నాగ వంశీ తెలిపారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని మహేష్ బాబు చెప్పారని.. చివరకు మహేష్ బాబు చెప్పిందే నిజమైందంటూ నిర్మాత నాగవంశీ అన్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మిక్స్‌డ్ టాక్ అందుకున్నప్పటికీ, ఈ చిత్రం మొదటి వారంలో అత్యధిక వసూళ్లు రాబట్టింది.

Next Story