ఆరోజు నుంచి థియేటర్‌కు వెళ్లడం మానేశాను..!

Naga Chaithanya Shares About Josh Movie Experience. అమీర్‌ ఖాన్‌ హీరోగా నటించిన చిత్రం లాల్‌ సింగ్‌ చద్దా. ఈ సినిమా ద్వారా నాగ చైతన్య

By Medi Samrat  Published on  13 Aug 2022 7:33 PM IST
ఆరోజు నుంచి థియేటర్‌కు వెళ్లడం మానేశాను..!

అమీర్‌ ఖాన్‌ హీరోగా నటించిన చిత్రం లాల్‌ సింగ్‌ చద్దా. ఈ సినిమా ద్వారా నాగ చైతన్య బాలీవుడ్‌ లో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో బాలరాజుగా కీలక పాత్రలో కనిపించాడు నాగ చైతన్య. అతడి పాత్రకు మంచి స్పందన వస్తోంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో నాగ చైతన్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే తాను సినిమా హాల్ కు వెళ్లి ఎంజాయ్ చేసి చాలా రోజులైందని అన్నారు. అందుకు కారణం తన మొదటి సినిమా జోష్ కు వచ్చిన రెస్పాన్స్ అని అన్నారు.

నా మొదటి సినిమా జోష్‌ విడుదలైనప్పుడు ప్రేక్షకుల రెస్పాన్స్‌ చూడాలన్న ఉద్దేశంతో మొదటి రోజు ఓ థియేటర్‌కి వెళ్లానన్నాడు. సినిమా మొదలైనప్పుడు బానే ఉంది కానీ.. ఇంటర్వెల్‌ సమయానికి చాలామంది ప్రేక్షకులు మధ్యలోనే థియేటర్ల నుంచి బయటికి వెళ్లిపోయారన్నాడు. ఆ సమయంలో చాలా బాధనిపించిందన్నాడు. అప్పటి నుంచి థియేటర్‌కు వెళ్లలేదన్నాడు చైతన్య. ఆరోజు జరిగిన సంఘటన నా మైండ్‌లోంచి ఇంకా పోలేదన్నాడు. త్వరలో తప్పకుండా థియేటర్‌కి వెళ్లి సినిమాను ఎంజాయ్‌ చేయాలనుకుంటాన్నానని నాగ చైతన్య వెల్లడించాడు. నాగ చైతన్య మొదటి సినిమా 'జోష్' కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయింది. ఆ సినిమాలో నాగ చైతన్య నటనకు మంచి మార్కులే పడ్డాయి.


Next Story