రికార్డుస్థాయిలో నాగ‌చైత‌న్య‌ 'లవ్ స్టోరీ' సినిమా బిజినెస్

Naga Chaithanya Love Story Movie Business. నాగచైతన్య.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‏లో తెరకెక్కుతున్న 'లవ్ స్టోరీ' సినిమా బిజినెస్ రికార్డుస్థాయిలో

By Medi Samrat
Published on : 12 Feb 2021 5:23 PM IST

Naga Chaithanya Love Story Movie Business

అక్కినేని నాగచైతన్య.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‏లో తెరకెక్కుతున్న సినిమా 'లవ్ స్టోరీ'. ఇందులో నాగచైతన్యకు జోడీగా ఫిదా ఫేం సాయి పల్లవి నటిస్తోంది. ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమా లవ్ స్టోరీ కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

నారాయణ దాస్ కె.నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా ఉన్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 16 వ తేదీన విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫిదా సినిమా అనంతరం చాలా గ్యాప్ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఓ వర్గం ఆడియేన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

దీంతో సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా 20.5కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ మా ఛానెల్ లవ్ స్టొరీ శాటిలైట్ హక్కులను 8కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకాట్టుకుంటుంది. ఖచ్చితంగా మంచి మెమోరబుల్ హిట్ అవ్వడం ఖాయమట..


Next Story