గ్రాండ్ గా మొదలైన తండేల్..!

నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమా 'తండేల్' ముహూర్తం వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

By Medi Samrat  Published on  9 Dec 2023 9:00 PM IST
గ్రాండ్ గా మొదలైన తండేల్..!

నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమా 'తండేల్' ముహూర్తం వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. నాగ చైతన్య పాన్-ఇండియన్ చిత్రమిది. యువ సామ్రాట్ నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి ముచ్చటగా మూడోసారి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్ తండేల్. నాగ చైతన్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రమీది. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు నాగార్జున కెమెరా స్విచాన్ చేయగా, వెంకటేష్ క్లాప్‌బోర్డ్‌ కొట్టారు. అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తండేల్' చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో నాగచైతన్య మత్స్యకారుల నాయకుడిగా కనిపించనున్నాడు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఒరిజినల్ లొకేషన్లలోనే జరగనుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి నటిస్తోంది.

Next Story