ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఆ హీరో అభిమాన సంఘం అధ్యక్షుడిగా నాగచైతన్య?

Naga Chaitanya Becomes Mahesh Babu Fans Association President. నాగ చైతన్య.. అక్కినేని వారి న‌ట‌ వారసత్వం ప్రస్తుతం 'ట్యాంక్ యు ' సినిమా తో

By Medi Samrat  Published on  6 Jan 2021 5:15 AM GMT
Naga Chaitanya

నాగ చైతన్య.. అక్కినేని వారి న‌ట‌ వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకుని న‌టుడుగా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తన కొత్త చిత్రం 'థాంక్యూ' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక‌ ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం అబిడ్స్‌లోని రామకృష్ణ సినిమా థియేట‌ర్‌లో జరుగుతుండగా.. చైతుపై కొన్ని ముఖ్యమైన సీన్ల‌ను తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి.. ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.ఆ వార్త‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు అభిమానులకు తీపిక‌బురే. ఎందుకంటే.. ఈ సినిమాలో హీరో నాగ‌చైత‌న్య.. టాలీవుడ్ అగ్ర‌హీరో అయిన‌‌ మహేశ్‌బాబు అభిమాన సంఘం అధ్యక్షుడు అభిరామ్‌గా కనిపించనున్నాడట‌. అందుకు సంబంధించే.. అభిరామ్ పేరిట, మహేష్ బాబు పోస్టర్లతో థియేటర్ ప్రాంగణంలో బ్యానర్లు ఏర్పాటు చేసి ఆ స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నార‌ట‌.

ఇదిలావుంటే.. ఈ సినిమాకు బీవీఎస్‌ రవి కథ ర‌చ‌యిత‌కాగా.. అక్కినేని వారికి మ‌నం వంటి సూప‌ర్ హిట్ ఇచ్చిన‌ దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఇక‌ చిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా.. మరో కథానాయికగా అవికా గోర్‌ కనిపించనుంది. ఈ చిత్రాన్ని కుటుంబ క‌థా చిత్రాల నిర్మాత‌ దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.


Next Story