గుడుంబా శంకర్ రీ-రిలీజ్ కలెక్షన్లను జనసేనకు విరాళంగా ఇచ్చిన మెగా బ్రదర్

గుడుంబా శంకర్ రీ-రిలీజ్ కలెక్షన్లను జనసేనకు విరాళంగా ఇచ్చారు మెగా బ్రదర్, నిర్మాత నాగబాబు. జనసేన పార్టీకి గుడుంబా శంకర్ సినిమా

By Medi Samrat  Published on  14 Dec 2023 7:00 PM IST
గుడుంబా శంకర్ రీ-రిలీజ్ కలెక్షన్లను జనసేనకు విరాళంగా ఇచ్చిన మెగా బ్రదర్

గుడుంబా శంకర్ రీ-రిలీజ్ కలెక్షన్లను జనసేనకు విరాళంగా ఇచ్చారు మెగా బ్రదర్, నిర్మాత నాగబాబు. జనసేన పార్టీకి గుడుంబా శంకర్ సినిమా రీ-రిలీజ్ నుండి వచ్చిన 35 లక్షల రూపాయలను ఇచ్చారు. అంజన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగబాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. గుడుంబా శంకర్ రీ-రిలీజ్ కలెక్షన్లను నాగబాబు జనసేనకు విరాళంగా ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు నాదెండ్ల మనోహర్‌కి రూ. 35 లక్షలు అందించారు. అంతకు ముందు ఆరెంజ్ (రూ. 1 కోటి ఐదు లక్షలు), జల్సా (రూ. 1 కోటి) కలెక్షన్లను తాము గతంలో జనసేన పార్టీ ఫండ్‌కి అందించినట్లు తెలిపారు. పార్టీ సంక్షేమం పట్ల తనకు నిబద్ధత ఉందని.. తమ రీ-రిలీజ్ చిత్రాలకు భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా జనసేన పార్టీకి విరాళంగా ఇస్తానని నాగ బాబు హామీ ఇచ్చారు.


గుడుంబా శంకర్ సినిమాకు వీర శంకర్ దర్శకత్వం వహించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగ బాబు నిర్మించారు. గుడుంబా శంకర్ చిత్రం 2004లో విడుదలైంది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే అందించారు. యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ కూడా అందించారు. మీరా జాస్మిన్, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. అప్పట్లో యావరేజ్ గా నిలిచిన సినిమాకు.. రీ-రిలీజ్ లో ప్రేక్షకుల నుండి పెద్దగా స్పందన రాలేదు.

Next Story