మహేష్ బాబు వాయిసా.. మజాకా.. కలెక్షన్స్ కుమ్మేస్తోంది

'ముఫాసా ది లయన్ కింగ్' తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 10 కోట్ల గ్రాస్ రాబట్టింది.

By Medi Samrat  Published on  24 Dec 2024 5:30 PM IST
మహేష్ బాబు వాయిసా.. మజాకా.. కలెక్షన్స్ కుమ్మేస్తోంది

'ముఫాసా ది లయన్ కింగ్' తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ముఫాసా తెలుగు డబ్బింగ్ వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో బాగా రాణిస్తోంది. ఈ చిత్రానికి ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. మహేష్ బాబు వాయిస్‌ఓవర్ చిత్రానికి మరో సానుకూల అంశాన్ని జోడించింది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులలో ఈ చిత్రం 10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడే అడ్వాంటేజ్‌తో మరింత ఎక్కువ నంబర్‌లు సాధిస్తుందని భావిస్తున్నారు.

ముఫాసా ది లయన్ కింగ్ తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 10 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మద్దతుతో ఈ సినిమాకు బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించారు. ముఫాసా కోసం మహేష్ తన వాయిస్‌ని డబ్బింగ్ చెప్పగా, సత్యదేవ్ టాకా/స్కార్‌కి తన వాయిస్‌ని ఇచ్చాడు. ఆలీ, బ్రహ్మానందం, షేకింగ్ శేషు, అయ్యప్ప పి శర్మ ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. హిందీలో షారుఖ్ ఖాన్ ముఫాసా పాత్రకు తన వాయిస్‌ని ఇవ్వడం విశేషం.

Next Story