హైదరాబాద్ లో సాక్షి.. ఎవరి ఫ్యానో చెప్పేసింది

MS Dhoni Wife Sakshi Dhoni About Allu Arjun Movies. క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సినిమాల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  24 July 2023 4:15 PM GMT
హైదరాబాద్ లో సాక్షి.. ఎవరి ఫ్యానో చెప్పేసింది

క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సినిమాల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సొంత బ్యానర్ పై ఇప్పటికే సినిమా తీసేశారు. తమిళంలో నిర్మితమైన సినిమా 'LGM'ను తెలుగులో ఈ నెల 28వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ధోని భార్య సాక్షి సింగ్ బిజీగా ఉన్నారు. తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రమోషన్ కోసం, హీరో హరీశ్ కల్యాణ్, హీరోయిన్ ఇవానా, నదియా.. ఇతర బృందంతో కలిసి సాక్షి హైదరాబాద్ వచ్చారు.

సాక్షి సింగ్ ధోని మాట్లాడుతూ, ఎంటర్టయిన్ మెంట్ వరల్డ్ పట్ల ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుందని తెలిపారు. టీవీ, ఓటీటీ, సినిమా.. ఇలా ఫ్లాట్ ఫామ్ ఏదైనా, అందరూ కోరుకునేది ఎంటర్టయిన్ మెంట్ అని.. వినోద ప్రపంచం పట్ల ఉన్న ఆసక్తితోనే తాను సినిమాల నిర్మాణం దిశగా వచ్చానని ఆమె స్పష్టం చేశారు. ఇక ఐకాన్ అల్లు అర్జున్‌కు తాను అభిమానినని.. ఆయన సినిమాలన్నీ తాను చూశానని మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి చెప్పారు. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలు లేని రోజుల్లో తాను అల్లు అర్జున్ సినిమాలు చూశానన్నారు. నేను అల్లు అర్జున్ సినిమాలన్నీ చూసేశాను. ఆ టైమ్‌లో నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాంటివి లేవు. యూట్యూబ్‌లో గోల్డ్‌మైన్ ప్రొడక్షన్ ఛానెల్‌లోనే సినిమాలన్నీ చూశానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు సాక్షి. అల్లు అర్జున్ సినిమాలు చూస్తూ నేను పెరిగాను. ఆయనకు నేను చాలా పెద్ద అభిమానినని సాక్షి సింగ్ చెప్పుకొచ్చారు.


Next Story