మ్యాజిక్ ను క్రియేట్ చేస్తున్న మృణాల్.. ఇక తిరుగులేదు.!

సీతా రామం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే

By Medi Samrat  Published on  9 Dec 2023 6:54 PM IST
మ్యాజిక్ ను క్రియేట్ చేస్తున్న మృణాల్.. ఇక తిరుగులేదు.!

సీతా రామం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సీతారామం సినిమాలో మృణాల్ తన ఆకట్టుకునే లుక్స్, సొగసైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులపై ఇంపాక్ట్ ను చూపించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు భారీగా ఆఫర్స్ వచ్చాయి. అయితే ఆమె ఎంతో సెలెక్టివ్ గా ఎంచుకుంటున్న పాత్రలు వెండితెర మీద ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి. సీతారామం సినిమాలో కనిపించినట్లుగానే అదే మ్యాజిక్ ను మృణాల్ హాయ్ నాన్న సినిమాలో కూడా చూపించి ప్రశంసలను అందుకుంటూ ఉంది.

నాని సరసన మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న సినిమా ఈ గురువారం విడుదలైంది. ఈ సినిమా మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. తెలుగు కమర్షియల్ చిత్రాల్లో ఓ నటికి ఇంత బలమైన పాత్ర లభించడం చాలా అరుదు. అలాంటిది నటించిన రెండు సినిమాలలోనూ మృణాల్ అద్భుతం చేసి చూపించింది. మృణాల్ ఠాకూర్ తనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్నట్లు పలు ఇంటర్వ్యూలలో చెబుతూ వస్తోంది. ఆమె డెసిషన్ కూడా అలాంటిదేనని స్పష్టంగా సినిమాలను చూస్తుంటే అర్థం అవుతూ ఉంది. మృణాల్ ఠాకూర్ తదుపరి చిత్రం ఫ్యామిలీ స్టార్, ఇందులో ఆమె విజయ్ దేవరకొండతో కలిసి కనిపించనుంది. పెట్ల పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ రోల్ బలంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

Next Story