మిస్టర్ బచ్చన్ పరాజయం పాలవ్వడం హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్.. మరీ ముఖ్యంగా నిర్మాత టిజి విశ్వ ప్రసాద్‌కు పెద్ద ఎదురుదెబ్బ. సినిమాలోని సంగీతం, మాస్ ఎలిమెంట్స్ సినిమాకి బలంగా మారుతాయని అనుకున్నారు. అయితే ప్రీమియర్స్ పడిన తర్వాత డిజాస్టర్ టాక్ వచ్చింది. ప్రతి కేంద్రంలోనూ చాలా పేలవమైన కలెక్షన్లు వచ్చాయి.
ఇటీవలి ఇంటర్వ్యూలో నిర్మాత విశ్వ ప్రసాద్ సినిమా విడుదలకు ముందు హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు కూడా సినిమాను ప్రభావితం చేశాయని అన్నారు. కథనంలో కాస్త చిన్న చిన్న లోపాలు ఉన్నా, మిస్టర్ బచ్చన్ చెత్త సినిమా అయితే కాదన్నారు. ఫ్యాన్స్‌కి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అయితే హరీశ్ శంకర్ ఇచ్చిన ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫిరెన్స్ కారణంగా సినిమా ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది. పబ్లిసిటీ కోసం ఆయన ప్రయత్నించారు.. కానీ అది నెగిటివ్ ఎఫెక్ట్ చూపించిందన్నారు నిర్మాత. ఈ సినిమాపై కావాలనే కొందరు విమర్శలు చేశారని అన్నారు. మనం బలంగా ఉన్నప్పుడు, మనం ఎవరినైనా సవాలు చేయవచ్చు.. అయితే బలహీనమయ్యామని తెలిస్తే మాత్రం తప్పకుండా ఎదురుదాడి చేస్తారని అన్నారు.