రవితేజ అన్ని కోట్లు తిరిగిచ్చేశారా.?

మాస్ మహారాజ రవితేజ అంటే ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరో. కానీ ఇప్పుడు లెక్క మారిపోయిందని అంటున్నారు

By Medi Samrat  Published on  4 Sep 2024 3:30 PM GMT
రవితేజ అన్ని కోట్లు తిరిగిచ్చేశారా.?

మాస్ మహారాజ రవితేజ అంటే ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరో. కానీ ఇప్పుడు లెక్క మారిపోయిందని అంటున్నారు. రవితేజ డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా కూడా హిట్ ను అందుకోలేకపోయారు. అటు కొత్త డైరెక్టర్లు, ఇటు ఎంతో అనుభవం ఉన్న వాళ్లు కూడా మాస్ హిట్ ను అందించలేకపోయారు. రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' గత నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఈ చిత్రం ఆడియో కారణంగా మంచి బజ్ ను సృష్టించినా.. ఈ చిత్రం విడుదలైన తర్వాత పేలవమైన సమీక్షలను అందుకుంది. టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ పరాజయాల తర్వాత, రవితేజ అభిమానులు బాలీవుడ్ సూపర్‌హిట్ 'రైడ్' రీమేక్‌తో పెద్ద విజయం సాధించాలని ఆశించారు. అది జరగలేదు.. చిత్రం భారీ ఫ్లాప్‌గా నిలిచింది.

మిస్టర్ బచ్చన్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రవితేజ, హరీష్ శంకర్ ఇద్దరూ ఇప్పుడు తమ రెమ్యునరేషన్‌లో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా.. రవితేజ రూ. 4 కోట్లు, హరీష్ శంకర్ నిర్మాతలకు రూ. 2 కోట్లు తిరిగి ఇచ్చారని ఫిలింనగర్ టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ-రవితేజ కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ మూడవ సినిమా. ఈగల్, మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైనా.. వారి మొదటి చిత్రం ధమాకా భారీ విజయాన్ని సాధించింది.

Next Story