మహేష్ బాబు సినిమాలో మోనాల్ గజ్జర్.. క్లారిటీ వచ్చేసింది

Monal Gajjar About Mahesh Movie.మహేష్ బాబు సినిమాలో తను ఎలాంటి స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడటం లేదని స్పష్టం చేసింది.

By Medi Samrat  Published on  2 Feb 2021 12:41 PM GMT
Monal Gajjar About Mahesh Movie

బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ కు ఇటీవలి కాలంలో ఎన్నో ఆఫర్లు వస్తున్నాయని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఈ మధ్యనే అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ ఐటం సాంగ్ కు దుమ్ము రేపిన మోనాల్ కు మహేష్ బాబు సినిమాలో అవకాశం వచ్చిందని వార్తలు వైరల్ అయ్యాయి. ఐట‌మ్ సాంగ్స్ కే ఎక్కువ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ని‌.. మ‌హేశ్ బాబుతో రొమాన్స్ చేయ‌డానికి కూడా మోనాల్ ని నిర్మాతలు అడిగారంటూ కథనాలు వచ్చాయి. స‌ర్కారు వారి పాట‌లో మ‌హేశ్ బాబుతో హీరోయిన్ క‌మ్ ఐట‌మ్ గ‌ర్ల్ అయిన మోనాల్ ని ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి.

ఈ కథనాలపై మోనాల్ గజ్జర్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. సర్కారు వారి పాట సినిమాలో తను ఎలాంటి స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడటం లేదని స్పష్టం చేసింది. మోనాల్‌ ఇటీవలే బిగ్‌బాస్‌ రీయూనియన్‌ పార్టీలో తళుక్కున మెరిసింది. స్టార్‌ మా చేపట్టిన ఈ కార్యక్రమంలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఇక మోనాల్ చేతిలో పలు సినిమాల ఆఫర్లు ఉండడమే కాకుండా.. పలు టీవీ షోలు కూడా చేస్తూ ఉంది. ఇక మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సర్కారు వాటి పాట సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ అవకాశాన్ని దక్కించుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల కాబోతోంది.


Next Story
Share it