తెలుగులో వ‌స్తున్న‌ మాలీవుడ్ బాక్సాఫీస్ సెన్సేష‌న్‌.. '2018 ఎవరీవన్ ఈస్‌ ఏ హీరో'

Mollywood box office sensational hit movie '2018 Everyone is a Hero' coming in Telugu. మంచి సినిమాలు తీయడంలో మాలీవుడ్ ఎప్పుడు ముందు ఉంటుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

By Medi Samrat  Published on  15 May 2023 7:46 AM GMT
తెలుగులో వ‌స్తున్న‌ మాలీవుడ్ బాక్సాఫీస్ సెన్సేష‌న్‌.. 2018 ఎవరీవన్ ఈస్‌ ఏ హీరో

2018 Everyone is a Hero


మంచి సినిమాలు తీయడంలో మాలీవుడ్ ఎప్పుడు ముందు ఉంటుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో ఎంటర్టైన్మెంట్, సందేశాత్మక సినిమాలు అందించిన మాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు సినీ ప్రేక్షకులకు మరో బ్లాక్ బస్టర్ సినిమా కూడా అందించింది. ఆదే '2018 ఎవరీవన్ ఇస్ ఏ హీరో'. మే 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యి, రిలీజ్ అయిన అన్ని కేంద్రాలలో బ్లాక్‌బస్టర్ రన్‌ను కొనసాగిస్తోంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి మాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యపోతోంది.

ఈ చిత్రం 9వ రోజు కేవలం కేరళ నుంచే దాదాపు 5.18 కోట్లు వసూలు చేసింది అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పకనే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇది మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డ్. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్స్ చూస్తే.. ఈ చిత్రం కేవలం మొదటి 9 రోజుల్లో 80 కోట్ల ప్లస్ కలెక్ట్ చేసి.. ప్రస్తుతం 100 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతుంది. అంతే కాదు ఈ చిత్రానికి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ఏకంగా స్టాండింగ్ ఒవేషన్ రావడం గమనార్హం.

మలయాళీ ప్రేక్షకులు ఇది నిజమైన కేరళ కథ అని ఆకాశానికి ఎత్తుతున్నారు. మాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా విడుదలైన రోజు నుండే ఒక సినిమా‌ ఇంత ఎక్కువ ఆదరణ దక్కించుకోవడం అక్కడి వారినే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. కేరళ వరదలను రీక్రియేట్ చేసి ప్రేక్షకుల దగ్గర వావ్ అనిపించుకున్నారు ఈ సినిమా దర్శకుడు జూడ్. ప్రస్తుతం ఈ సినిమా ని తెలుగులో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు ఈ చిత్ర మేకర్స్. మంచి కథ ఉంటే మన తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను ఎంతగా ఆదరిస్తారో తెలిసిన విషయమే. అందుకే ఈ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెలుగులో త్వరలోనే విడుదల చేయనున్నారట.

మే 5న విడుదలైన ఈ భారీ బడ్జెట్ చిత్రంకి జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. టోవినో థామస్, ఆసిఫ్ అలీ, కుంచకో బోబన్, లాల్, నరైన్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి, తన్వి తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించారు. కావ్య ఫిల్మ్‌ కంపెనీ, పీకే ప్రైమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై వేణు కున్నప్పిల్లి, సీకే పద్మకుమార్‌, ఆంటో జోసెఫ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే.. బ్లాక్ బస్టర్ సినిమా మాలికప్పురం తర్వాత కావ్య ఫిల్మ్ కంపెనీ నుండి వచ్చిన సినిమా ఇది. దీంతో ఈ నిర్మాణ సంస్థ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకుంది. మాలికాపురం సినిమాని ఆల్రెడీ తెలుగులో రిలీజ్ చేసిన మేకర్స్.. ఈ సినిమా ద్వారా ఎంత‌టి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి మ‌రి.

ఇతర సాంకేతిక నిపుణులు : ప్రొడక్షన్ డిజైనర్ & ఆర్ట్ డైరెక్టర్: మోహన్‌దాస్, కెమెరామెన్‌: అఖిల్ జార్జ్, ఎడిటర్: చమన్ చాకో, లైన్ ప్రొడ్యూసర్: హోపకుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: శ్రీకుమార్ చెన్నితల, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: సైలెక్స్ అబ్రహం, డిజిటల్ టీమ్: దిలీప్, తనయ్ సూర్య




Next Story