ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్.. అంచనాలు భారీగా ఉన్నాయి బాస్

Ram Pothineni, Puri Jagannadh unite yet again for 'iSmart Shankar' sequel. యంగ్ హీరో రామ్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'.

By Medi Samrat  Published on  14 May 2023 9:45 PM IST
ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్.. అంచనాలు భారీగా ఉన్నాయి బాస్

యంగ్ హీరో రామ్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ కూడా తన సత్తా చాటారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉండొచ్చని మొదట్లోనే చెప్పారు. అయితే ఇప్పుడు అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా రానున్నట్లు "డబుల్ ఇస్మార్ట్" మూవీ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమా కోసం రామ్ ఫ్యాన్స్ తో పాటు పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మే 15 రామ్ పోతినేని పుట్టిన రోజున కావడంతో, ఫాన్స్ కి గిఫ్ట్ ఇస్తూ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు పూరి. ఇక ఈ సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు. వచ్చే సంవత్సరం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. డబుల్ ఇస్మార్ట్ మూవీ పాన్ ఇండియా రేంజుకి తీసుకెళ్ళనున్నట్లు తెలుస్తోంది. రామ్ పోతినేని-బోయపాటి మూవీ షూటింగ్ ఫినిష్ అవగానే డబుల్ ఇస్మార్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమా మొత్తం 'శంకర్' అనే రౌడీ షీటర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో నభా నటేష్, నిధి అగర్వాల్ లు హీరోయిన్లుగా నటించారు. ఓ రౌడీ షీటర్ మైండ్ లో ఓ చిప్ ను పెట్టడం వల్ల జరిగే పరిణామాలను ఈ సినిమాలో చూపించారు. ముఖ్యంగా సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఎన్నో ఫ్లాప్స్ తర్వాత నిర్మాత ఛార్మీకి కూడా లాభాలు తీసుకొచ్చిన సినిమా ఇది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ అంటే మాత్రం అంచనాలు భారీగా ఉంటాయి.


Next Story