ఓటీటీలోకి వచ్చేసిన మోహన్ లాల్ భారీ బడ్జెట్ సినిమా

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మలైక్కోట్టై వాలిబన్. భారీ బడ్జెట్ మలయాళం సినిమాల్లో ఇది ఒకటి.

By Medi Samrat  Published on  23 Feb 2024 8:00 PM IST
ఓటీటీలోకి వచ్చేసిన మోహన్ లాల్ భారీ బడ్జెట్ సినిమా

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మలైక్కోట్టై వాలిబన్. భారీ బడ్జెట్ మలయాళం సినిమాల్లో ఇది ఒకటి. దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో 'పాన్-ఇండియన్' సినిమాగా విడుదల చేయాలని భావించారు. అయితే ప్రమోషన్స్ చేయడంలో చిత్ర బృందం భారీగా విఫలమైంది. భారీ రిలీజ్ కు కూడా నోచుకోలేదు. మలయాళంలో కాకుండా ఇతర భాషల్లో ఎప్పుడు విడుదలైందో కూడా చాలా మందికి తెలియదు. చాలా వరకూ ఈ సినిమాకు పర్వాలేదనే సమీక్షలు వచ్చాయి.

మోహన్‌లాల్ నటించిన నెరు (2023) బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సాధించినప్పటికీ.. మలైక్కోట్టై వాలిబన్ రిపబ్లిక్ డే వారాంతంలో విడుదలైనప్పటికీ అనుకున్నంత సక్సెస్ ను అందుకోలేదు. కేవలం 30 కోట్ల రూపాయల కలెక్షన్స్ మాత్రమే సాధించింది. చాలా ఏరియాల్లో ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తీ అయింది. దీంతో మేకర్స్ హాట్‌స్టార్‌లో ముందస్తు డిజిటల్ ప్రీమియర్ కోసం వెళ్లారు. ఒరిజినల్ వెర్షన్‌తో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీలో కూడా నేటి నుండి సినిమా అందుబాటులో ఉంటుంది. మరి OTT లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Next Story