మంచు విష్ణు కన్నప్పలో మరో సూపర్ స్టార్

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో పలువురు స్టార్స్ భాగమవుతున్నారు.

By Medi Samrat  Published on  30 Sept 2023 5:26 PM IST
మంచు విష్ణు కన్నప్పలో మరో సూపర్ స్టార్

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో పలువురు స్టార్స్ భాగమవుతున్నారు. ‘కన్నప్ప ఎ ట్రూ ఎపిక్ ఇండియన్ టేల్' ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కించాలని మంచు విష్ణు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రం అన్ని భారతీయ భాషల్లో విడుదల కానుంది. మంచు విష్ణు కెరీర్ లో ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం విష్ణుతో పాటు భారీ తారాగణం నటించనుంది. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార శివపార్వతులు గా కనిపించనున్నారనే ప్రచారం సాగుతూ ఉంది.

వీరితో పాటు ఇప్పుడు మరో సూపర్‌స్టార్‌ కూడా ఈ చిత్రంలో భాగమైనట్లు చెబుతున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ‘కన్నప్ప’లో ఒక ముఖ్యమైన పాత్ర చేయడానికి అంగీకరించారని చెబుతున్నారు. ఆయన పాత్ర, రన్‌టైమ్ గురించి రహస్యంగా ఉంచారు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. స్టార్ ప్లస్ టీవీలో మహాభారత సిరీస్‌ను రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’కు దర్శకత్వం వహించనున్నారు. 150 కోట్లతో ఈ సినిమా రూపొందనుంది. లెజెండరీ రైటర్స్ పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ కథ అందిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు.

Next Story