ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిలో ఓ జర్నలిస్టు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యాడు. ఈ ఘటనలో మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పీఎస్ లో హత్యాయత్నం కేసు నమోదు అయింది. దీనిపై ఆయన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పును డిసెంబర్ 23కు వాయిదా వేశారు.
గత కొద్దిరోజులుగా మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద గొడవకు దిగడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రాత్రి సమయంలో కవరేజికి వెళ్లిన టీవీ9 చానల్ జర్నలిస్టు రంజిత్ కుమార్ ను మోహన్ బాబు మైక్ తో కొట్టారు. చెవికి, కంటికి మధ్య గాయమైనట్లు వైద్యపరీక్షల్లో తేలింది.