మోహన్ బాబు మరో సంచలన ఆడియోను విడుదల చేశారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన ఆయన ఈ ఘటన జరిగినందుకు తాను బాధపడుతున్నట్లుగా తెలిపారు. ఓ వైపు తాను కుటుంబ సమస్యను పరిష్కరించుకోడానికి ప్రయత్నిస్తూ ఉండగా జర్నలిస్టులు తన ఇంట్లోకి వచ్చేశారన్నారు. ఇది ఎంత వరకూ సమంజసం అంటూ చెప్పుకొచ్చారు. మొదట తాను నమస్కారం పెట్టానని.. అయినప్పటికీ అతను మైక్ పెట్టాడని అన్నారు. జర్నలిస్టును కొట్టాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. నా కన్నుకు మైక్ తగలబోయిందని, తృటిలో తప్పించుకున్నానని మోహన్ బాబు అన్నారు. నిజ జీవితంలో నటించాల్సిన అవసరం తనకు లేదని, నా ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి రావడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. నా ఇంట్లోకి వచ్చింది మీడియా వాళ్లు అవునో, కాదో తనకు తెలియదని మోహన్ బాబు చెప్పారు. నా ఇంటి లోపలికి వచ్చి ఏకాగ్రత, ప్రశాంతతను భగ్నం చేశారని అన్నారు. ఆవేశంలో తాను కొట్టిన దెబ్బ అతనికి తగిలిందని.. ఈ ఘటనకు బాధపడుతున్నానని వివరించారు. జర్నలిస్టును కొట్టాలని ఆ దేవుడి సాక్షిగా తాను అనుకోలేదని మోహన్ బాబు తెలిపారు.
ఆ చీకట్లో ఘర్షణ జరిపోయింది.. దెబ్బ తగిలిన వ్యక్తి కూడా నాకు తమ్ముడు లాంటి వాడేనని మోహన్ బాబు అన్నారు. ఆ జర్నలిస్టు కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారోనని కూడా తాను ఆలోచించనన్నారు. గేటు బయట నేను కొట్టి ఉంటే ఎన్ని కేసులైనా పెట్టుకోవాలని అన్నారు.