'మీర్జాపూర్ సీజన్ 3' రాబోతోంది

మీర్జాపూర్.. ఈ సిరీస్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మొదటి రెండు సీజన్ లు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

By Medi Samrat  Published on  10 Nov 2023 8:45 PM IST
మీర్జాపూర్ సీజన్ 3 రాబోతోంది

మీర్జాపూర్.. ఈ సిరీస్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మొదటి రెండు సీజన్ లు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. సీజన్ 3 ఎప్పుడెప్పుడు OTTలో విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. మూడో సీజన్ షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ పనులు చక చకా జరిగిపోతూ ఉండడంతో మీర్జాపూర్ 3 త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకానుంది. అందుకు సంబంధించి ఓ పోస్టును తాజాగా ప్రైమ్ వీడియో పెట్టింది.

మొదటి రెండు సీజన్లకు వచ్చిన ప్రజాదరణ కారణంగా.. మూడవ సీజన్‌ పై ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. పంకజ్ త్రిపాఠి పోషించిన అఖండానంద త్రిపాఠి పాత్ర మాత్రమే కాదు.. గుడ్డు భయ్యా.. మున్నా భయ్యా.. ఇలాంటి చాలా క్యారెక్టర్లు అభిమానుల మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ పొలిటికల్ క్రైమ్ డ్రామా సిరీస్ లో ఎవరు మిగులుతారు.. ఎవరు పోతారు అనే విషయంలో చాలా సస్పెన్స్ నడుస్తూ ఉంది. మూడవ సీజన్‌లో కూడా చాలా యాక్షన్, సస్పెన్స్, డ్రామా ఉండబోతోంది. మీర్జాపూర్ సీజన్ 3లో పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగల్, హర్షిత శేఖర్ గౌర్, అలీ ఫజల్, అమిత్ సియాల్, అంజుమ్ శర్మ, షీబా చద్దా, రాజేష్ తైలాంగ్, భువన్ అరోరా తదితరులు నటించారు.

Next Story