ఎట్టకేలకు మీర్జాపూర్ సీజన్-2 తెలుగులో..
Mirzapur Season 2 Telugu. మీర్జాపూర్.. ఈ వెబ్ సిరీస్ కు హిందీలో ఎంత మంది అభిమానులు ఉన్నారో కానీ తెలుగులో మాత్రం భారీగా
By Medi Samrat Published on 11 Dec 2020 2:18 PM ISTమీర్జాపూర్.. ఈ వెబ్ సిరీస్ కు హిందీలో ఎంత మంది అభిమానులు ఉన్నారో కానీ తెలుగులో మాత్రం భారీగా ఉన్నారు. ఈ హిందీ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తెలుగు వాళ్లకు చాలా బాగా నచ్చింది. మీర్జాపూర్ మొదటి సీజన్ హిట్ అవ్వడంతో.. రెండో సీజన్ మీద కూడా అంతే అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే హిందీలో రెండో సీజన్ విడుదలైంది.. ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం బాగా నిరాశ కలిగించింది.
ఎందుకంటే హిందీలో రెండో సీజన్ రిలీజ్ చేసినప్పుడు తెలుగు డబ్బింగ్ ను విడుదల చేయలేదు. ఎంతగానో ఎదురు చూసారు మీర్జాపూర్ తెలుగు ఫ్యాన్స్.. ఇలా ఎలా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను విడుదల చేయకుండా ఉంటారు అని పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఆ వెబ్ సిరీస్ లో నటించిన పలువురు నటీనటుల సోషల్ మీడియా అకౌంట్లకు తెలుగు వాళ్లు మెసేజీల మెసేజీలు పెట్టారు. చాలా రోజుల నుండి ఎదురుచూస్తూనే ఉన్నారు తెలుగు అభిమానులు.
అక్టోబర్ 23న ఈ వెబ్ సిరీస్ విడుదలవ్వగా.. ఇప్పటికే తెలుగు డబ్బింగ్ ను విడుదల చేశారు. మీర్జాపూర్-2 చిత్ర యూనిట్ తాజాగా తెలుగు అభిమానులకు శుభవార్తను అందించింది. ఈ సిరీస్‌ను తెలుగులోనూ రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంత ఆలస్యంగా విడుదల చేస్తారా అని కొందరు అంటుంటే.. ఆలస్యమైనా విడుదల చేశారు చాలు.. అని మరికొందరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.