బాలీవుడ్‌లో విషాదం.. 'మీర్జాపూర్' నటుడు బ్రహ్మ మిశ్రా మృతి

'Mirzapur' Actor Brahma Mishra Found Dead at Home. బాలీవుడ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. మిర్జాపూర్ అనే వెబ్ సిరీస్‌లో లలిత్ పాత్రలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హిందీ నటుడు బ్రహ్మ మిశ్రా

By అంజి  Published on  2 Dec 2021 12:24 PM GMT
బాలీవుడ్‌లో విషాదం.. మీర్జాపూర్ నటుడు బ్రహ్మ మిశ్రా మృతి

బాలీవుడ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. మిర్జాపూర్ అనే వెబ్ సిరీస్‌లో లలిత్ పాత్రలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హిందీ నటుడు బ్రహ్మ మిశ్రా కన్నుమూశారు. ముంబైలోని వెర్సోవాలోని నటుడి ఫ్లాట్‌లో పోలీసులు మృతదేహాన్ని కనుగొన్నారు. నటుడు మిశ్రా మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి శవపరీక్ష నిమిత్తం పంపినట్లు తెలిసింది. ఆయన మృతదేహాం పూర్తి కుళ్లిపోయే స్థితిలో ఉంది. నవంబరు 29న మిశ్రా ఛాతీ నొప్పితో బాధపడుతున్నారని, మందులు తీసుకున్న తర్వాత డాక్టర్ ఇంటికి పంపించారని తెలిసింది. ఆ తర్వాత గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

అయితే నటుడు బ్రహ్మ మృతిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. అయితే బ్రహ్మ మిశ్రా ఆత్మహత్య చేసుకున్నారా, హత్యానా, హఠాన్మరణం అనే వివరాలు తెలియాల్సి ఉంది. మిర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌లో మున్నా త్రిపాఠి స్నేహితుడు లలిత్‌ పాత్రలో బ్రహ్మ మిశ్రా నటించారు. 'మీర్జాపూర్‌' 1, 2 సిరీస్‌లతో పాటు 'మంజి: ద మౌంటెన్‌ మ్యాన్‌', 'కేసరి' సహా పలు సినిమాల్లో మిశ్రా నటించాడు. కాగా మిశ్రా మరణంపై నటుడు దివ్యేందు శర్మ స్పందించారు. "రిప్‌ బ్రహ్మ మిశ్రా. మన లలిత్‌ ఇక లేరు. అందరూ అతని కోసం ప్రార్థిద్దాం" అని తన సంతాపాన్ని తెలియజేశారు.

Next Story
Share it