జపాన్ మినిస్టర్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అట..!

Minister of Foreign Affairs of Japan Says Jr NTR Is His Favourite Star. ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  28 July 2023 2:30 PM GMT
జపాన్ మినిస్టర్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అట..!

ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే..! ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సెలబ్రిటీలు, ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. గోల్డెన్ గ్లోబ్స్, ఆస్కార్ అకాడమీ అవార్డులు సహా గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ చిత్రానికి అనేక అవార్డులు అందాయి. ఇప్పుడు, జపాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ RRR సినిమా చూశాక తాను ఎన్టీఆర్‌కి అభిమాని అని చెప్పడం విశేషం.

జపనీస్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి యోషిమాస హయషి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాటలో అద్భుతమైన డాన్స్ చేసిన ఇద్దరు యాక్టర్లున్నారు. కానీ వారిలో నా ఫేవరేట్‌ అంటే ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ వరించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టారు దర్శకుడు రాజమౌళి. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు, సాంకేతిక నిపుణులు సైతం ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది.


Next Story