'యాత్ర-2' సినిమా రివ్యూ చెప్పిన మంత్రి అంబటి

2019లో మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా యాత్ర. ఈ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ప్రాజెక్ట్‌ యాత్ర 2.

By Medi Samrat  Published on  8 Feb 2024 5:15 PM IST
యాత్ర-2 సినిమా రివ్యూ చెప్పిన మంత్రి అంబటి

2019లో మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా యాత్ర. ఈ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ప్రాజెక్ట్‌ యాత్ర 2. ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన యాత్ర 2 థియేటర్లలో ఫిబ్రవరి 8న) విడుదలైంది. డైరెక్టర్‌ ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా వైఎస్సార్‌ మరణం తర్వాత వైఎస్ జగన్ వ్యక్తిగత, రాజకీయ జీవితంలో జరిగిన నేపథ్యాలను నిజాయితీగా చూపించే ప్రయత్నం చేసినట్టు సినిమాను చూసిన వాళ్లు చెబుతున్నారు. వైఎస్‌ జగన్ అభిమానులకు మాత్రం చాలా నచ్చుతుంది.. యాత్ర 2 ఉత్తమ బయోగ్రఫికల్‌ పొలిటికల్‌ మూవీగా నిలిచే అవకాశం ఉందని కూడా ట్విట్టర్ లో టాక్ నడుస్తూ ఉంది.

యాత్ర-2 సినిమాను వైసీపీ నేతలు వీక్షించారు. మంత్రి అంబటి రాంబాబు యాత్ర-2 సినిమాను చూసిన అనంతరం తన స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. యాత్ర-2 చిత్రంలోని ఎమోషనల్ సన్నివేశాలు నా గుండెను పిండేశాయి అంటూ అంబటి ట్వీట్ చేశారు. త్రీ ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్లపై యాత్ర-2 చిత్రాన్ని నిర్మించారు.

Next Story