పెళ్లి వాయిదా వేసుకున్న ఎఫ్-2 భామ

Mehreen Pirzada postpones her marriage. కరోనా కార‌ణంగా వెడ్డింగ్ ప్లాన్ వాయిదా ప‌డ‌నుంద‌ని మెహ్రీన్ తాజాగా తెలిపింది.

By Medi Samrat  Published on  27 May 2021 3:47 PM GMT
Mehreen Pirzada

మెహ్రీన్.. టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా ద్వారా ఎంతో మందికి క్రష్ లిస్టులోకి వెళ్ళిపోయిన మెహ్రీన్ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయింది. అయితే పెద్దగా సక్సెస్ లు మాత్రం అందుకోలేకపోయింది. ఎఫ్-2 మాత్రం ఆమెకు మంచి హిట్ గా నిలిచింది. ఓ వైపు కెరీర్ బిజీగా ఉన్న సమయంలో పెళ్ళికి సిద్ధమయ్యానని మెహ్రీన్ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. మెహ్రీన్ హ‌ర్యానాకు చెందిన కాంగ్రెస్ నేత భ‌వ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే.

ఈ ఏడాది చివ‌రిలో పెళ్లి జ‌రుపుకోవాల‌ని అనుకున్నారు మెహ్రీన్-భ‌వ్య బిష్ణోయ్. కరోనా కార‌ణంగా వెడ్డింగ్ ప్లాన్ వాయిదా ప‌డ‌నుంద‌ని మెహ్రీన్ తాజాగా తెలిపింది. త‌న పెండ్లి వ‌చ్చే ఏడాదికి వాయిదా వేసుకుంటున్న‌ట్టు చెప్పింది. ప్రస్తుతానికి పెళ్లి గురించి ఆలోచించడం లేదని.. ప‌రిస్థితులు సాధార‌ణంగా మారే వ‌ర‌కు ఎదురు చూస్తామని చెప్పింది. మెహ్రీన్-భ‌వ్య బిష్ణోయ్ ల కుటుంబ సభ్యులు పెళ్లిని చాలా గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటూ ఉన్నాయి.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గ్రాండ్ గా జరుపుకునే అవకాశాలే లేవు. అందుకే ఇరు కుటుంబాలు పెళ్లిని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం త‌ర్వాత మెహ‌రీన్‌తోపాటు ఆమె తల్లికి క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. ముంబైలోని నివాసంలో ఐసోలేష‌న్ లో ఉండి కోలుకున్నారు. భ‌వ్య బిష్ణోయ్ స‌హా అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా క‌రోనా పాజిటివ్ గా రావడం.. ఆ తర్వాత కోలుకోవడం జరిగింది. మెహ్రీన్ ప్రస్తుతానికి ఎఫ్-2 సీక్వెల్ లో నటిస్తూ ఉంది.
Next Story
Share it