గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న మెగా స్టార్ చిరంజీవి

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కష్టమైన విషయం.

By Medi Samrat  Published on  30 Aug 2023 3:45 PM IST
గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న మెగా స్టార్ చిరంజీవి

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కష్టమైన విషయం. ఒక హీరో సినిమాను మిస్ అవ్వడం, అదే సినిమా మరో హీరో చేసిన తర్వాత పెద్ద హిట్ అవ్వడం చిత్ర పరిశ్రమలో కొత్త విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కూడా అదే జరిగింది. వెబ్ సిరీస్ లలో 'ది ఫ్యామిలీ మ్యాన్' కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇండియన్ వెబ్ సిరీస్‌లలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ది ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. దీన్ని తెలుగు దర్శక ద్వయం రాజ్, డీకే రూపొందించారు. స్టార్ నటి సమంత రెండవ సీజన్‌లో నెగిటివ్ రోల్‌లో చేసింది.

ఈ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించిన మనోజ్ బాజ్‌పేయికి భారీగా ప్రశంసలు లభించాయి. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ తాజా ఇంటర్వ్యూలో ది ఫ్యామిలీ మ్యాన్ స్క్రిప్ట్ మెగాస్టార్ చిరంజీవికి తప్ప మరెవరికీ చెప్పలేదని అన్నారు. ది ఫ్యామిలీ మ్యాన్‌ని చిరంజీవితో ఫీచర్ ఫిల్మ్‌గా రూపొందించడానికి రాజ్, డికె స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. నిర్మాత అశ్వినీదత్‌కి కూడా ఈ సబ్జెక్ట్ బాగా నచ్చి చిరంజీవికి చెప్పారట. ఖైదీ నంబర్ 150 వంటి కమర్షియల్ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన చిరుకి కథ బాగా నచ్చింది కానీ ఇద్దరు పిల్లలకు తండ్రిగా ప్రేక్షకులు ఆదరిస్తారా అనే సందేహం నెలకొంది. రాజ్-డికె ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపించకుండా ఉండటానికి కొన్ని మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. అదే స్క్రిప్ట్ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌గా రూపొందించారు.. అది భారీ సక్సెస్ ను అందుకుంది. ఈ విషయాన్నీ స్వయంగా అశ్వినీదత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Next Story