మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
లెజెండరీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య అర్ధాంగి కనకరత్నమ్మ తుదిశ్వాస విడిచారు.
By Medi Samrat
లెజెండరీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య అర్ధాంగి కనకరత్నమ్మ తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో అల్లు, మెగా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన అత్తగారి మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భావోద్వేగభరితమైన సంతాప సందేశాన్ని పంచుకున్నారు. చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మా అత్తయ్య గారు... కీ.శే అల్లు రామలింగయ్య గారి అర్ధాంగి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులందరి పట్ల ఆమె చూపిన ప్రేమను, అందించిన ధైర్యాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః అంటూ చిరంజీవి తన సంతాపాన్ని తెలియజేశారు.
అల్లు కనకరత్నమ్మ వృద్ధ్యాప్య సమస్యలతో కన్నుమూశారు. విషయం తెలియడంతో అల్లు అర్జున్ ముంబై నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కనకరత్నం ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య భార్య, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, చిరంజీవికి అత్త కాగా రామ్‌చరణ్‌కు అమ్మమ్మ.