మాస్ జాత‌ర‌లా మెగాస్టార్ ‘భోళా శంకర్‌’ టీజ‌ర్‌

MegaStar Chiranjeevi Bholaa Shankar Teaser. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ద‌ర్శ‌కుడు మెహర్‌ రమేష్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’.

By Medi Samrat  Published on  24 Jun 2023 7:48 PM IST
మాస్ జాత‌ర‌లా మెగాస్టార్ ‘భోళా శంకర్‌’ టీజ‌ర్‌

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ద‌ర్శ‌కుడు మెహర్‌ రమేష్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’. తమిళ మూవీ వేదాళంకు రీమేక్‍గా భోళా శంకర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి గ‌తంలో చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి. తాజాగా మూవీ టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ మూవీలో ట్యాక్సీ డ్రైవర్‌, గ్యాంగ్‍స్టర్‌గా చిరంజీవి నటిస్తున్నట్లు తెలుస్తోంది. టీజ‌ర్‌లో చిరు చెప్పిన‌ డైలాగ్‌లు ఆక‌ట్టుకున్నాయి.


మొత్తం 33 మందిని చంపేశాడు.. థర్టీ త్రీ పీపుల్.. ‘ఒక్కడా.. హౌ’” అనే వాయిస్‍ ఓవ‌ర్‌తో భోళా శంకర్ మూవీ టీజర్ ప్రారంభమైంది.‘షికారు కొచ్చిన షేర్‌ను బే’, ‘ఇస్టేట్‌ డివైడ్‌ అయినా అందరూ నా వాళ్లే. ఆల్‌ ఏరియాస్‌ అప్నా హే. నాకు హద్దులు లేవు సరిహద్దులు లేవు అంటూ మెగాస్టార్‌ తెలంగాణ స్లాంగ్‌తో చెప్పిన‌ డైలాగ్స్ అదరిపోయాయి. టీజర్‌లో చిరూకి చెల్లి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేశ్ మెరిసింది. హీరోయిన్‍గా నటిస్తున్న‌ తమన్నా కూడా త‌ళుక్కుమంది. కీలక పాత్ర పోషిస్తున్న సుశాంత్ కూడా స్టైలిష్ వాక్‌లో క‌నిపించాడు. మొత్తానికి టీజ‌ర్ మాస్ జాత‌ర‌లా ఉంది. టీజ‌ర్ చూసిన అభిమానులు సోష‌ల్ మీడియాలో లైక్లు, షేర్‌లు, కామెంట్‌ల‌తో త‌మ ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఈ సినిమాకు రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ చిత్రానికి సంగీతం మహతి స్వర సాగర్ కాగా.. సినిమాటోగ్ర‌ఫీ డడ్లీ. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Next Story