భర్త మరణం తర్వాత స్పందించిన నటి మీనా

Meena Sagar reacts to ‘false information’ being spread around husband Vidyasagar’s death. భర్త మరణాంతరం మీనా తొలిసారి స్పందించారు. తన భర్త విద్యాసాగర్‌ మరణంపై

By Medi Samrat  Published on  1 July 2022 2:30 PM GMT
భర్త మరణం తర్వాత స్పందించిన నటి మీనా

భర్త మరణాంతరం మీనా తొలిసారి స్పందించారు. తన భర్త విద్యాసాగర్‌ మరణంపై సోషల్‌ మీడియాలో వస్తున్న ఆసత్య ప్రచారంపై మీనా విచారం వ్యక్తం చేశారు. న‌టి మీనా త‌న భ‌ర్త విద్యా సాగ‌ర్‌ మ‌ర‌ణంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రుగుతున్న అసత్య ప్ర‌చారంపై విచారం వ్య‌క్తం చేశారు. భ‌ర్త దూర‌మ‌య్యార‌నే బాధ‌లో తానున్నానని, అదేమీ ప‌ట్టించుకోకుండా త‌న భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నారంటూ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గత కొంతకాలం ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్‌ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు.

తన భర్త మరణంపై ఆసత్య ప్రచారాలు చేయొద్దని నటి మీనా కోరారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆమె భావోద్వేగ పోస్ట్‌ షేర్‌ చేశారు. 'భర్త దూరమయ్యారనే భాధలో ఉన్నాను. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసికి భంగం కలిగించకండి. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి. నా భర్త మరణంపై దయచేసి ఎలాంటి ఆసత్య ప్రచారాలు చేయొద్దని మీడియాను విజ్ఞప్తి చేస్తున్నా.' అని అన్నారు. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలిచి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా భర్త ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కృషి చేసిన వైద్య బృందం, తమిళనాడు సీఎం, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్‌ రాధాకృష్ణన్‌, సన్నిహితులు, మిత్రులకు కృతజ్ఞతలని చెప్పుకొచ్చారు. ఆయన కోలుకోవాలని ప్రార్థించిన అభిమానుల ప్రేమకు ధన్యవాదాలని చెప్పారు మీనా.
Next Story
Share it