గోపీ చంద్ 'భీమా' ట్రైలర్ వచ్చేస్తోంది

టాలీవుడ్ న‌టుడు గోపీచంద్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు.

By Medi Samrat  Published on  23 Feb 2024 3:45 PM IST
గోపీ చంద్ భీమా ట్రైలర్ వచ్చేస్తోంది

టాలీవుడ్ న‌టుడు గోపీచంద్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 08న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ట్రైల‌ర్ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్. భీమా ట్రైల‌ర్‌ను ఫిబ్ర‌వ‌రి 24 సాయంత్రం 4 గంట‌ల‌కు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.

గోపీచంద్ భీమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. కొత్త పోస్టర్ లో మరో లుక్‌ను రివీల్ చేశారు. ముఖం కనిపించనప్పటికీ, గోపీచంద్ మరో రోల్ లో షాక్ ఇవ్వబోతున్నట్లు ఈ చిత్రం ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. అతని గెటప్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సినిమా ట్రైలర్ రేపు విడుదల కానుండడంతో ఆ రోల్ కు సంబంధించిన పలు విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంది. భీమా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది.

Next Story