ఏంటి.. రామ్ 'స్కంద' సినిమాకు.. ఆ స్థాయిలో బిజినెస్ జరుగుతోందా?
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్కంద' చిత్రం
By Medi Samrat Published on 30 Aug 2023 7:00 PM ISTరామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్కంద' చిత్రం మరో రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ట్రేడ్ సర్కిల్‌లలో మంచి క్రేజ్‌ను కలిగి ఉంది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులతో సహా ఏకంగా 150 కోట్ల భారీ వ్యాపారం జరుగుతూ ఉంది. స్కంద సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను స్టార్ గ్రూప్ 54 కోట్లకు కొనుగోలు చేసింది [ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్]. తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మా కొనుగోలు చేసింది. డిజిటల్ హక్కులు డిస్నీ+ హాట్ స్టార్ ప్లాట్‌ఫారమ్ దగ్గర ఉన్నాయి. థియేట్రికల్ రైట్స్ విలువ 60 కోట్లు కాగా.. హిందీ వెర్షన్ శాటిలైట్ రైట్స్ దాదాపు 35 కోట్లుగా ఉంది.
‘స్కంద’ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. రామ్ కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం. ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరా మెన్ గా పని చేశారు. ఎడిటింగ్‌ను తమ్మిరాజు నిర్వహిస్తున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.