త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్

హీరోయిన్ త్రిషకు త‌మిళ న‌టుడు మన్సూర్ ఆలీ ఖాన్ క్షమాపణలు చెప్పారు.

By Medi Samrat  Published on  24 Nov 2023 10:00 PM IST
త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్

హీరోయిన్ త్రిషకు త‌మిళ న‌టుడు మన్సూర్ ఆలీ ఖాన్ క్షమాపణలు చెప్పారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేగింది. ఆ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిషకు అండగా నిలిచారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. క్షమాపణలు చెప్పేదే లేదని అంతకుముందు చెప్పారు. అయితే తప్పు తెలుసుకున్నారో లేక ఎవరైనా తగ్గితే మంచిదని మన్సూర్ కు సూచించారో కానీ.. త్రిషపై చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గారు. త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. "నా వ్యాఖ్యలు త్రిష మనసుకు బాధ కలిగించాయి. అందుకు క్షమాపణలు కోరుతున్నా." అని మన్సూర్ తెలిపారు.

త్రిష‌తో నేను చేసే స‌న్నివేశాలలో ఒక్క స‌న్నివేశం అయినా బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నా.. నా మునుప‌టి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిష‌ను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నానని లియో సినిమాకు సంబంధించి మన్సూర్ వ్యాఖ్యలు చేశారు. చాలా సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. రేప్ సీన్లు నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదన్నారు మన్సూర్. ఈ వ్యాఖ్యలపై త్రిష మండిపడింది. మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరమైనదిగా అనిపిస్తోంది. అతని లాంటి వ్యక్తితో ఇప్పటివ‌ర‌కు స్క్రీన్ స్పేస్‌ను ఎప్పుడూ పంచుకోనందుకు నేను అదృష్టవంతురాలిని. నా మిగిలిన కెరీర్ లో అలాగే నా సినిమాలో అతడు లేకుండా చూసుకుంటాను. మన్సూర్ అలీ ఖాన్ లాంటి వారి వల్ల మానవాళికి చెడ్డపేరు వస్తుందని త్రిష సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

Next Story