రేపే 'కన్నప్ప' రిలీజ్.. మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్
మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి, ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కన్నప్ప'.
By Medi Samrat
మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి, ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కన్నప్ప'. జూన్ 27న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, మంచు మనోజ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ఓ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ లో ఎక్కడా కూడా తన సోదరుడు మంచు విష్ణు పేరును ప్రస్తావించలేదు.
మంచు మనోజ్ తన ట్వీట్లో.. కన్నప్ప టీమ్‌కు నా శుభాకాంక్షలు. ఈ సినిమా కోసం మా నాన్నగారు మోహన్ బాబు, ఆయన బృందం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ప్రేమతో, అంకితభావంతో పనిచేశారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. "నా లిటిల్ చాంప్స్ అరియానా, వివియానా, అవ్రామ్‌లు (మంచు విష్ణు పిల్లలు) వెండితెరపై మంచి జ్ఞాపకాలను పంచుకోనుండటం చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని వివరించారు. తనికెళ్ల భరణి గారి జీవితకాల స్వప్నం రేపు సాకారం కాబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని, గోల్డెన్ హార్టెడ్ ప్రభాస్ గారికి, దిగ్గజాలు మోహన్‌లాల్ గారికి, అక్షయ్ కుమార్ గారికి, ప్రభుదేవా గారికి, ఈ సినిమాను ప్రేమతో, నమ్మకంతో ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ వెండితెరపై ప్రకాశించడం చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" ట్వీట్ చేశారు.