బ్లాక్‌బస్టర్ సినిమా మంజుమ్మేల్ బాయ్స్ దర్శకుడు హిదంబరం ఎస్. పొడువాల్ పై 2022లో జరిగిన ఒక సంఘటనపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కొచ్చిలోని ఎలాంకుళంలోని తన అపార్ట్‌మెంట్‌లోకి చిదంబరం బలవంతంగా ప్రవేశించి లైంగిక ఉద్దేశ్యంతో ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఒక యువ నటి ఫిర్యాదు చేసింది. ఎర్నాకులం సౌత్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
చిదంబరం 2024లో విడుదలైన మంజుమ్మేల్ బాయ్స్‌తో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇది భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ ప్రేక్షకుల నుండి విస్తృత ప్రశంసలను అందుకుంది. ఆ సమయంలో మలయాళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.