మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్ పెళ్లి చేసుకుంటున్నారా..?

Manjima Mohan, Gautham Karthik to tie the knot this year. ఇండస్ట్రీలో తాజా సమాచారం ప్రకారం మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్

By Medi Samrat  Published on  12 Feb 2022 8:45 PM IST
మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్ పెళ్లి చేసుకుంటున్నారా..?

ఇండస్ట్రీలో తాజా సమాచారం ప్రకారం మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రచారం అవుతోంది. వీరిద్దరూ 2019లో దేవరాట్టం సినిమా కోసం కలిసి పనిచేశారు. చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. వారు తమ సంబంధాన్ని గురించి బయట చెప్పుకోకపోయినా.. ఈ జంట ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని పింక్ విల్లా సంస్థ వెల్లడించింది. యువ జంటకు సన్నిహితంగా ఉన్న ఒకరు ఈటైమ్స్‌తో మాట్లాడుతూ "గౌతమ్, మంజిమ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు కూడా తెలుసు. ఇప్పుడు, వారు సంవత్సరం చివరి నాటికి పెళ్లి చేసుకుని.. తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు.

ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా, పెళ్లిపై దృష్టి పెట్టేందుకు ఈ ఏడాది సరైన సమయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది'' అని అన్నారు. ఏప్రిల్‌లోనే మంజిమా మోహన్ మరియు గౌతమ్ కార్తీక్ వివాహం జరుగుతుందని పుకారు షికారు చేస్తోంది. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ కోసం వేచి ఉండాల్సి ఉంది. గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ 2019లో ఎం ముత్తయ్య దర్శకత్వం వహించిన దేవరాట్టం చిత్రంలో కలిసి కనిపించారు. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. మంజిమా మోహన్ నాగ చైతన్య సరసన 'సాహసం శ్వాసగా సాగిపో' అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది.


Next Story