మంచు విష్ణు మంచి మ‌న‌సు

Manchu Vishnu who helped actress Pakeezha. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ నటి పాకీజాకు సాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు.

By M.S.R  Published on  17 March 2023 1:20 PM GMT
మంచు విష్ణు మంచి మ‌న‌సు

Manchu Vishnu


తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ నటి పాకీజాకు సాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలు సాయం చేయగా.. తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు ముందుకు వచ్చారు. తన తండ్రి మోహన్ బాబు సినిమాల్లో పాకీజాకు మంచి పాత్రలు వచ్చేవి. అసెంబ్లీ రౌడీ చిత్రంలో ఆమె పాత్ర అప్పట్లో బాగా పాపులర్.

తమిళ, తెలుగు సినిమాల్లో ఆమె అప్పట్లో ఎక్కువగా పాత్రలు చేసింది. ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే పాకీజాకి లక్షరూపాయలు అందించారు. మోహన్ బాబు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. తాను అమెరికాలో ఉన్నానని ఇండియా రాగానే సాయం చేస్తానని మాట ఇచ్చినట్లుగా పాకీజా తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న మంచు విష్ణు ఆమెకు అండగా నిలిచారు. తన సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డును ఆమెకు అందించనున్నాడు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మా అసోసియేషన్ కార్డుకు గతంలో రూ.లక్ష రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు రూ. 90 వేలకు తగ్గించారు. మా అసోసియేషన్‌కు కట్టాల్సిన రూ.90 వేల రూపాయలను మంచు విష్ణు చెల్లించి పాకీజాకు కార్డు ఇప్పించారు మంచు విష్ణు. పాకీజా తనకు వేషాలు కావాలని అడుగుతూ వస్తున్నారు. ఛాన్స్ లు ఇస్తే చాలని.. నటించాలని ఉందని ఆమె కోరుకుంటూ ఉన్నారు.


Next Story
Share it