మంచు విష్ణుని ఫాలో అవుతాం: దిల్‌ రాజు

కన్నప్ప సినిమా విషయంలో రివ్యూలకు సంబంధించి మంచు విష్ణు తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడిందని, ఇకపై అందరూ అదే ఫాలో అవుతామని దిల్ రాజు చెప్పారు.

By Medi Samrat
Published on : 2 July 2025 9:15 PM IST

మంచు విష్ణుని ఫాలో అవుతాం: దిల్‌ రాజు

కన్నప్ప సినిమా విషయంలో రివ్యూలకు సంబంధించి మంచు విష్ణు తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడిందని, ఇకపై అందరూ అదే ఫాలో అవుతామని దిల్ రాజు చెప్పారు. సినిమాను కాపాడాడానికి ఎవరు ఏ మంచి చేసినా, తామంతా అది ఫాలో అవుతామని, కన్నప్ప చిత్రబృందం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. రిలీజ్‌కు ముందే అలా ఒక హెచ్చరిక జారీచేస్తే ఫేక్‌ రివ్యూస్‌, నెగెటివ్‌ ట్రోలింగ్‌, పైరసీ తగ్గిపోతుందన్నారు. సినిమాపై కావాలని నెగెటివ్‌గా రాస్తే ఎక్కువగా నష్టపోయేది నిర్మాత మాత్రమేనన్నారు. హీరోలు, దర్శకులు ఈ సినిమా కాకపోతే మరో సినిమాతో హిట్‌ కొడతారని, కానీ నిర్మాత అయితే ఆ సినిమాకు డబ్బులు పోగొట్టుకోవాల్సిందేనని అన్నారు దిల్ రాజు.

మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నప్ప సినిమాని టార్గెట్‌గా చేసుకొని కావాలని ఎవరైన నెగెటివ్‌గా పోస్టులు పెట్టిన, వ్యక్తిగత హననానికి పాల్పడినా ఉద్దశ్యపూర్వకంగా విమర్శలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తే కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పబ్లిక్‌ కాషన్‌ నోటీస్‌ని కన్నప్ప టీమ్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Next Story