మంచు విష్ణు అలా.. మంచు మనోజ్ ఇలా..!
Manchu Vishnu And Manchu Manoj. సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 31 July 2023 9:45 PM ISTసినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 'మా' ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధ్యక్షుడిగా తన కాల పరిమితి ముగిసేలోగా పూర్తి చేస్తానని ఆయన తెలిపారు. మంచు విష్ణు ఇచ్చిన హామీల్లో 'మా' బిల్డింగ్ ముఖ్యమైనది. గత ఎన్నికల్లో మంచు విష్ణుకు సీనియర్ నటుడు నరేశ్ మద్దతుగా నిలిచారు. టీఎఫ్సీసీ ఎన్నికల్లో ఓటును వినియోగించుకున్న తర్వాత నరేశ్ మాట్లాడుతూ... 'మా' బిల్డింగ్ గురించి మంచు విష్ణు నే చెప్పాలని అన్నారు. ఈ సారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అందరం ప్రయత్నిస్తామని చెప్పారు. ఇంతలో మంచు విష్ణు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఇక సోమవారం ఉదయం చంద్రబాబు ఇంటికి వెళ్లారు మంచు మనోజ్ దంపతులు. చంద్రబాబు నాయుడు కొద్దిసేపు వారితో ముచ్చటించారు. వివాహం అయ్యాక మొదటిసారి ఇంటికి రావడంతో చంద్రబాబు వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. భేటీ అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ.. పెళ్లయిన తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు గారిని కలవడానికి వచ్చామని అన్నారు. మా భేటీ లో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని.. రేపు మా బాబు పుట్టినరోజు కావడంతో ఆయన బ్లెస్సింగ్స్ కోసం వచ్చామని అన్నారు. పొలిటికల్ ఎంట్రీ పై త్వరలో నిర్ణయం ఉంటుందని అన్నారు. మంచు మౌనిక మాట్లాడుతూ.. చంద్రబాబుని గారిని కలవడం చాలా సంతోషంగా ఉందని.. పెళ్లయిన తర్వాత నుంచి ఆయనను కలవాలని అనుకున్నామని.. ఈరోజు కుదిరిందని అన్నారు.