మీడియాపై మోహన్ బాబు ఆగ్ర‌హం

Manchu Mohan Babu Fire On Media. సినీ న‌టుడు మోహన్ బాబు మీడియాపై ఫైర్ అయ్యారు. గురువారం ఆయన షాద్‌న‌గ‌ర్‌ సబ్ రిజిస్ట్రేషన్

By Medi Samrat  Published on  13 July 2023 2:49 PM IST
మీడియాపై మోహన్ బాబు ఆగ్ర‌హం

సినీ న‌టుడు మోహన్ బాబు మీడియాపై ఫైర్ అయ్యారు. గురువారం ఆయన షాద్‌న‌గ‌ర్‌ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు. అయితే మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు.. కొందరు అక్క‌డికి వెళ్లారు. మీడియాను చూడగానే మోహన్ బాబు చిందులు తొక్కారు. ఆ లోగోలు లాక్కొండయ్యా అంటూ తన బౌన్సర్లకు సూచించారు. బుద్ధి లేదా? అంటూ మీడియా ప్ర‌తినిధుల‌వైపు చేయి చూపిస్తూ.. ఆగ్ర‌హంగా నోటికి పని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. మోహన్ బాబు తీరుపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

గ‌త కొంత కాలంగా సినిమాల విష‌యంలో కాకుండా కుటుంబ వ్య‌వ‌హారాల‌ కార‌ణంగా మంచు కుటుంబం వార్త‌ల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం జ‌రిగిన‌ మంచు మ‌నోజ్, మౌనిక‌ల‌ పెళ్లి.. ఆ త‌ర్వాత విష్ణు, మ‌నోజ్‌ల గొడ‌వ గురించి మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఆ వార్త‌లకు ఎప్ప‌టిక‌ప్పుడూ వివ‌ర‌ణ ఇస్తూనే.. మంచు కుటుంబం కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉంటుంది. తాజాగా ఈ ఘ‌ట‌న‌తో మ‌రోమారు మీడియా అటెన్ష‌న్ మంచు ఫ్యామిలీ వైపు మ‌ళ్ల‌నుంది.



Next Story