నిన్న వీడియో.. నేడు బతకనివ్వండి.. అంటూ పోస్టు పెట్టిన మంచు మనోజ్‌

Manchu Manoj says 'live and let live' after video of rift with Vishnu Manchu goes viral. టాలీవుడ్‌ లెజెండరీ నటులు మంచు మోహన్‌బాబు వారసులు మంచు విష్ణు, మంచు మనోజ్‌

By M.S.R  Published on  25 March 2023 4:54 PM IST
నిన్న వీడియో.. నేడు బతకనివ్వండి.. అంటూ పోస్టు పెట్టిన మంచు మనోజ్‌

Manchu Manoj


టాలీవుడ్‌ లెజెండరీ నటులు మంచు మోహన్‌బాబు వారసులు మంచు విష్ణు, మంచు మనోజ్‌ గొడవలు పడుతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. తాజాగా మనోజ్‌ పోస్ట్‌ చేసిన వీడియోతో వీళ్లద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని అనుకుంటూ ఉన్నారు. మంచు మనోజ్‌ అనుచరుడు సారథిపై విష్ణు గొడవకు దిగడం.. మా వాళ్లను, బంధువులను ఇలా కొడుతుంటారండి. ఇదీ ఇక్కడి పరిస్థితి అంటూ మనోజ్‌ వీడియోలో చెప్పారు. దీనిపై విష్ణు స్పందించి.. ఇవి అన్నదమ్ములు మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలే అంటూ వివరణ ఇచ్చారు.

తాజాగా మంచు మనోజ్‌ సోషల్‌ మీడియాలో ఆసక్తికర ట్వీట్స్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ‘కళ్ల ముందు జరుగుతున్న తప్పులను చూసి చూడనట్టు వదిలేయడం కన్నా నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధమే’, ‘క్రియేటివిటీకి నెగెటివిటీయే శత్రువు’ అంటూ రెండు కోట్‌లను షేర్‌ చేస్తూ ‘మీరు బ్రతకండి, ఇతరులను కూడా బ్రతకనివ్వండి’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


Next Story