నేను పారిపోవడం లేదు.. నాకు న్యాయం జరగాలి : మంచు మనోజ్
మంచి ఫ్యామిలీ వివాదం నడుస్తుండగా.. తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 18 Jan 2025 4:35 PM ISTమంచి ఫ్యామిలీ వివాదం నడుస్తుండగా.. తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన ఆస్తులలో ఉన్న అందర్నీ ఖాళీ చేయించాలని జిల్లా మెజి స్ట్రేట్‌కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్ పల్లి లో ఉన్న తన ఆసులను కొంత మంది అక్రమంగా ఆక్రమించుకున్నారు. తన ఆస్తులలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించి తనకు అప్పగించాలని మోహన్ బాబు జిల్లా మెజిస్ట్రేట్‌ను కోరారు. గత కొన్ని రోజుల నుంచి మోహన్ బాబు తిరుపతిలో ఉంటున్నారు. జల్‌పల్లి ఇంటిలో మంచు మనోజ్ నివాసం ఉంటున్నాడు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం.. తన ఆస్తులను స్వాధీనం చేసుకుని.. తనకు అప్పగించాలని మోహన్ బాబు మెజిస్ట్రేట్‌ను కోరుతూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పోలీసుల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జల్‌పల్లి ఇంటిలో ఉంటున్న మంచు మనోజ్‌కి నోటీసు ఇచ్చారు.
కాగా, మంచు మనోజ్ ఈ రోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కలిశారు. అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ.. జిల్లా అదనపు కలెక్టర్‌కికు పూర్తి వివరాలు తెలిపాను.. అడగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. జల్‌పల్లి ఆస్తి విషయాల్లో నేను అక్రమంగా ఎంటర్ కాలేదు.. కుర్చొని మాట్లాడుదామని చెప్పాను.. నేను పారిపోవడం లేదన్నారు. ఎప్పుడు పిలిచినా వస్తాను.. ఆస్తి విషయాల్లో నేను ఏం తప్పు చేయలేదు. తిరుపతి యూనివర్సిటీలో జరిగిన తగాదాల్లో ప్రశ్నించినందుకు నన్ను టార్గెట్ చేశారు. విష్ణు నా తండ్రిని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకం ఇదంతా.. అంటూ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తి తగాదాలు కాలేదు.. టోటల్ ఎపిసోడ్ లో దొంగలు ఎవరో ప్రజలు అందరికీ తెలుసునని అన్నారు. ఆ రోజు జల్‌పల్లిలొ ఉన్న నా ఇంటికి రానివ్వ లేదు.. నా కూతురు లోపల ఉంది.. అందుకే గొడవ జరిగింది.. ఇంట్లో, బయట యూనివర్శిటీ స్టూడెంట్స్ కోసం నేను నిలబడ్డాను. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. నాన్నగారిని నేను ఎప్పుడూ వ్యతిరేకించను.. కలెక్టర్ ఆదేశాలనుసారం నడుచుకుంటాను.. నాకు న్యాయం జరగాలని మంచు మనోజ్ అన్నారు.