మంచు లక్ష్మికి కొత్త చిక్కులు

Manchu Lakshmi Youtube Channel Hacked. మంచు లక్ష్మి యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది.

By Medi Samrat  Published on  11 May 2021 12:22 PM GMT
Manchu Lakshmi

మంచు లక్ష్మి.. తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. టీవీ షో వ్యాఖ్యాతగా, నటిగా, నిర్మాతగా రాణిస్తూ ఉన్నారు. మరో వైపు యూట్యూబ్ లో కూడా సందడి చేస్తూ ఉంటారు. తన కుమార్తెతో కలిసి యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! పిల్లలకు నచ్చే చాలా అంశాలను ఈ యూట్యూబ్ ఛానల్ లో చూపిస్తూ ఉంటారు. తాజాగా ఈ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది.

'చిట్టి చిల‌క‌మ్మా' అనే పేరుతో న‌డిపించే ఈ ఛాన‌ల్‌లో మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ కూడా క‌నిపిస్తూ ఉంటుంది. 'చిట్టి చిల‌క‌మ్మ' యూ ట్యూబ్ ఛానల్‌కు మంచు ల‌క్ష్మి త‌న కూతురితో క‌లిసి వీడియోలు చేస్తోంది. చిన్నారుల‌కు అర్థమయ్యేలా ఆమె పాఠాలు.. పిల్ల‌లను ఎలా పెంచాలో వంటి విషయాలను కాస్త ఎంటర్టైనింగ్ గా చెబుతూ ఉంటుంది. వారిని ఒత్తిడికి ఎలా దూరంగా ఉంచ‌వ‌చ్చో, వారికి అర్థ‌మ‌య్యే రీతిలో విష‌యాల‌ను ఎలా చెప్ప‌వ‌చ్చో మంచు ల‌క్ష్మి త‌న‌దైన శైలిలో వివ‌రిస్తుంది.

తాజాగా ఈ యూట్యూబ్ ఛాన‌ల్‌ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఈ విష‌యాన్ని మంచు లక్ష్మి స్వ‌యంగా తెలిపింది. చిట్టి చిల‌క‌మ్మా యూట్యూబ్ ఛాన‌ల్ హ్యాకింగ్ గురైందని.. ఈ పేజీలో వ‌చ్చే అంసంబంధిత కంటెంట్‌ను ప‌ట్టిచ్చుకోకండని కోరింది. అకౌంట్‌ను మ‌ళ్లీ తిరిగి ప్రారంభించే ప‌నిలో మా టీమ్ స‌భ్యులు ఉన్నార‌ని మంచు లక్ష్మి ట్వీట్ చేసింది.

ఇక అంతకు ముందు మరో ట్వీట్ చేసి మంచి లక్ష్మి వార్తల్లో నిలిచారు. 'రియల్ హీరోలయితే ఇంట్లోనే ఉండండి. మీరు రియల్ హీరోనా లేక తుస్ వ్యక్తులా? అనేది మీరే డిసైడ్ చేసుకోండి' అని ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్‌లో 'తుస్' అనే పదం చూసి ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.


Next Story