అనిల్ రావిపూడి దర్శకత్వంలో, మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ఒక కీలక ప్రకటన చేసింది. సినిమా విడుదల సందర్భంగా పది రోజుల పాటు పెంచిన టికెట్ ధరల గడువు ముగియడంతో, తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ధరలకే టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇకపై మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లలో రెగ్యులర్ ధరలు వర్తిస్తాయి. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు టికెట్ ధరలు తగ్గడంతో సినిమాకు ప్రేక్షకాదరణ మరింత పెరుగుతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.