మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి స్పెషల్‌గా వచ్చి సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా ఓటీటీ ప్రియులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నది. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠి, బెంగాలి భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర బృందం. అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో వెంకటేశ్ దగ్గుబాటి, క్యాథరిన్ ట్రెసా తదితరులు ఇతర పాత్రల్లో అలరించారు. చిరంజీవి కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా ఈ సినిమా నిలిచింది.