ఈ సంక్రాంతికి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'మన శంకర వర ప్రసాద్ గారు' సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. UA (13+) సర్టిఫికేట్‌తో సెన్సార్ చేయబడింది. 164 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉంది. ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. జనవరి 11న పెయిడ్ ప్రీమియర్‌లు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకులలో బలమైన బజ్‌ను సృష్టించింది. పాటలు, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ బాగా పనిచేసింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఈ చిత్రం యొక్క రన్‌టైమ్ 2 గంటల 44 నిమిషాలుగా లాక్ చేశారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి విడుదలయ్యే ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.