షారుఖ్ ఖాన్ ఇల్లు.. మన్నత్ ను బాంబుతో లేపేయబోతున్నా..

Man threatens to blow up Shah Rukh Khan’s Mannat. మహారాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్

By M.S.R  Published on  11 Jan 2022 3:02 PM IST
షారుఖ్ ఖాన్ ఇల్లు.. మన్నత్ ను బాంబుతో లేపేయబోతున్నా..

మహారాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నివాసం 'మన్నత్' సహా ముంబైలోని పలు ప్రాంతాలను పేల్చివేస్తానని బెదిరించిన వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 6వ తేదీన ఓ గుర్తుతెలియని కాలర్ నగరంలోని పలు ప్రాంతాలను బాంబుతో పేల్చివేస్తానని బెదిరింపు కాల్ చేశాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), కుర్లా రైల్వే స్టేషన్, షారూఖ్ ఖాన్ బంగ్లా.. ఇలా పలు ప్రాంతాల్లో బాంబులు పెడతానని బెదిరించాడు. అలా బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి పేరు జితేష్ ఠాకూర్. ముంబై పోలీసులు కాల్‌ను ట్రేస్ చేసి, ఆ నంబర్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుండి వచ్చిందని కనుగొన్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. జబల్పూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ గోపాల్ ఖండేల్ మాట్లాడుతూ మహారాష్ట్ర పోలీసులు మొబైల్ నంబర్‌ను మాతో పంచుకున్నారు, దాని ఆధారంగా 35 ఏళ్ల జితేష్ ఠాకూర్ ని అరెస్టు చేశామని అన్నారు. నిందితుడికి మద్యం సేవించే అలవాటు ఉందని.. గతంలోనూ ఇలాంటి బూటకపు కాల్‌లు చేసి డయల్ 100 సిబ్బందితో గొడవ పడ్డాడని ఖండేల్ వెల్లడించారు. కాల్ వచ్చిన తరువాత, అనేక చోట్ల సోదాలు నిర్వహించబడ్డాయి, అయితే అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడలేదు.


Next Story