న‌టుడు విజయ్‌పై లైంగిక వేధింపుల కేసు

Malayalam Film Producer Vijay Babu Charged With Rape. మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు.

By Medi Samrat
Published on : 27 April 2022 4:06 PM IST

న‌టుడు విజయ్‌పై లైంగిక వేధింపుల కేసు

మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. విజయ్ బాబుపై కేరళ పోలీసులు లైంగిక వేధింపుల అభియోగాలు మోపారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఎర్నాకులం సౌత్ పోలీసులు విజయ్ బాబుపై కేసు నమోదు చేశారు. కొచ్చిలోని ఒక ఫ్లాట్‌లో తనపై ప‌లుమార్లు లైంగిక దాడి జరిగింద‌ని.. తన అసభ్యకరమైన వీడియోను కూడా విజ‌య్ బాబు రికార్డ్ చేశారని మహిళ ఆరోపించింది. లైంగిక దాడికి ముందు తాను మద్యం మత్తులో ఉన్నానని మహిళ ఫిర్యాదులో తెలిపింది. ఏప్రిల్ 22న విజయ్ బాబుపై మ‌హిళ‌ ఫిర్యాదు చేసింది. కానీ ఇంత వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని తెలుస్తోంది.

ఈ వార్త వెలువ‌డిన‌ వెంటనే.. విజయ్ బాబు బుధవారం తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ప్రత్యక్షమ‌య్యాడు. ఈ కేసులో 'అసలు బాధితుడు' తానేనని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని విజ‌య్ బాబు చెప్పారు. నేను ఏ తప్పు చేయలేదు.. మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నా వద్ద అన్ని రికార్డులు ఉన్నాయని విజయ్ బాబు అన్నాడు.

Next Story