నటుడు నెడుమూడి వేణు ఇకలేరు

Malayalam actor Nedumudi Venu dies at 73 in Kerala. కేరళలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మలయాళ నటుడు నెడుమూడి వేణు తుది శ్వాస విడిచారు

By Medi Samrat
Published on : 11 Oct 2021 3:41 PM IST

నటుడు నెడుమూడి వేణు ఇకలేరు

కేరళలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మలయాళ నటుడు నెడుమూడి వేణు తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 73. అనారోగ్యం కారణంగా నటుడిని ఇటీవల ఆసుపత్రికి తరలించారు. నెడుమూడి వేణు ఇటీవలే కోవిడ్ -19 నుండి కోలుకున్నారు. వేణుకు టిఆర్ సుశీలతో వివాహం జరిగింది. వేణు మరణంపై ట్విట్టర్‌లో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మలయాళ నటుడు నెడుమూడి గత కొన్ని నెలలుగా కడుపు సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి ఇటీవల విషమించడంతో అతడిని కేరళలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో వేణు ఈరోజు (అక్టోబర్ 11) ఉదయం తుది శ్వాస విడిచారు. నెడుమూడి వేణు మరణం పట్ల నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు సంగీత్ శివన్, పలువురు నటులు ట్విట్టర్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెడుమూడి వేణు తెలుగు, తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించారు.

ఒరిజినల్ పేరు కేశవన్ వేణుగోపాల్‌ అయినప్పటికీ స్టేజ్ నేమ్ నెడుమూడి వేణుతో ప్రసిద్ధి చెందారు. నెడుమూడి అనేక దశాబ్దాలుగా తన కెరీర్‌లో 500 కి పైగా చిత్రాలలో నటించారు. నటనతో పాటు, వేణు అనేక చిత్రాలకు స్క్రీన్ ప్లే రాశారు. ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. నెడుమూడి వేణు నటనకు మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు మరియు ఆరు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు గెలుచుకున్నారు.


Next Story