'దసరా' నటుడి ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

ప్రముఖ మలయాళ యాక్టర్ షైన్‌ టామ్‌ చాకో ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

By Knakam Karthik
Published on : 6 Jun 2025 1:15 PM IST

Cinema News, Tamilnadu, Malayalam Aactor, Shine Tom Chacko, Accident

'దసరా' విలన్ నటుడి ఇంట్లో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

ప్రముఖ మలయాళ యాక్టర్ షైన్‌ టామ్‌ చాకో ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఆయన తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. టామ్‌ చాకో, ఆయన తల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన తమిళనాడు సమీపంలోని ధర్మపురిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..టామ్ చాకోతో పాటు అతడి సోదరుడు, తండ్రి కలిసి కారులో త్రిస్సూర్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకొట్టె సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చాకో తండ్రి సీపీ చాకో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. చాకోతో పాటు సోదరుడు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ధర్మపురి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Next Story