ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'రాజాసాబ్'. జూన్ 16న టీజర్ రిలీజ్ చేయనుంది. ఇంతలో టీజర్‌ని లీక్ చేశారు. సినిమాకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మూవీ టీమ్ హెచ్చరికలు జారీ చేసింది.
రాజాసాబ్ కంటెంట్ ఎవరి సోషల్ మీడియాలోనైనా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోస్టు పెట్టింది. అంతేకాకుండా అకౌంట్ సస్పెండ్ చేస్తామని, అందరూ సహకరించాలని మూవీ టీమ్ ట్వీట్ చేసింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్లలోకి తీసుకురానున్నారు. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటించారు. సంజయ్ దత్ విలన్‌గా చేశాడు. తమన్ సంగీతమందించాడు.